ఆదరించండి!

2
322

అందరికీ నమస్కారం

‘పల్లెప్రపంచం అంతర్జాలపత్రిక’ను ప్రారంభిస్తున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. ఈ అంతర్జాలపత్రిక ‘పల్లెప్రపంచం సర్వీసెస్’ సంస్థ తరపున నడుపబడుతున్నది. సంస్థ విజన్లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. ఈ పత్రిక ఎడిటర్ గానూ, సంస్థ మేనేజింగ్ పార్టనర్ గానూ ఉన్న నాకు వివిధ పత్రికలలో మండల, జిల్లా స్థాయిలలో జర్నలిస్టుగా, ‘జనవిజయం’ వార పత్రిక ఎడిటర్ గా పనిచేసిన అనుభవం ఉన్నది.

‘పల్లెప్రపంచం అంతర్జాలపత్రిక’ పత్రిక ఏ ఒక్క వర్గానికో, భావజాలానికో అనుకూలంగా ఉండదు. ప్రగతిశీల భావాలను ప్రచారం చేయడానికి, అందరికీ పనికి వచ్చే అంశాలను అందించేందుకు కృషి చేస్తుంది. మూఢ నమ్మకాలను, పారద్రోలేందుకు, ప్రజలలో నిరంతరం చైతన్యం నింపడం ద్వారా ప్రజల పక్షాన ఉంటూ మెరుగైన సమాజం కోసం ప్రయత్నిస్తాము. వివిధ అంశాలపై మా అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేస్తాము. ప్రజలకు, సమాజానికి హాని కలిగించని వివిధ భావజాలాలు కలిగిన వ్యక్తుల, శక్తుల అభిప్రాయాలను ప్రకటించేందుకు అనుమతిస్తాము. 

ఆరోగ్యం, ఆర్ధికం, రాజకీయం, ప్రకృతి, పర్యావరణం, విద్య, వికాసం, విజ్ఞానం, కథలు, సీరియల్స్, సాహిత్యం, సభలు, సమావేశాలు, ప్రభుత్వపథకాలు, విశ్లేషణలు, వ్యాసాలు, వినోదం, క్రీడలు, వివిధ అంశాలపై ప్రజల అభిప్రాయాలు తెలిపే వివిధ శీర్షికలు, ఇంటర్వ్యూలు….. ఇలా అన్ని రకాల అంశాలను అందించే ప్రయత్నం చేస్తాము. 

చదువరుల అభిప్రాయాలను క్రోడీకరించి విలువైన సూచనలను అమలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము. ఈ పత్రికలో లోపాలున్నా, ఇంకా మెరుగుపర్చాలన్నా ఎప్పటికపుడు మా దృష్టికి తీసుకురావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. నిరంతరం ఈ పత్రికను అభివృద్ధి చేసేందుకు శక్తిమేరకు కృషి చేస్తాము. 

అభిప్రాయాలూ, సూచనలూ, సలహాలూ, రచనలూ పంపాల్సిన మెయిల్ ఐ.డి:palleprapancham@gmail.com

-పల్లా కొండల రావు, ఎడిటర్,
17 సెప్టెంబర్, 2018,
ఖమ్మం.

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

2 COMMENTS

    • ధన్యవాదాలు ప్రసాద్ గారు. పల్లెప్రపంచం కు మీవంటి రచయితల ప్రోత్సాహం ఎల్లపుడూ ఉంటుందని ఆశిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here