బిజీగా ఉన్నారా…..సత్తి పాడేది వినండి….మారగలమేమో చూడండి!

1
769

బిత్తిరి సత్తి …… తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలీని వారుండరు. వి6 చానల్ లో తీన్మార్ వార్తలు కార్యక్రమం ద్వారా పాపులారిటీ సంపాదించుకుని సెలబ్రిటీ గా మారాడు. బిత్తిరి గా అతను చేసే అల్లరి ని ఇష్టపడని వారుండరు. యూ ట్యూబ్ లో సత్తి వీడియోలకు వ్యూస్ కూడా అధికంగా ఉంటుంటాయి. మనమెంత ఎమోషన్స్ లో … ఒత్తిడిలో ఉన్నా ఫ్రీ అవ్వాలంటే బిత్తిరి వీడియోలు చూస్తె రిలీఫ్ వస్తుందంటే అతిశయోక్తి కాదు. బిత్తిరి సత్తి ఉరఫ్ కావలి రవికుమార్ లో మంచి గాయకుడు కూడా ఉన్నాడు. గాయని మధుప్రియ తో కలసి నేటి బిజీ గజిబిజి లైఫ్ లో మనం ఏమి మిస్ అవుతున్నామో తెలుపుతూ పాడిన పాత ఆకట్టుకుంటోంది. ‘ఏదో మిస్సింగ్…’ అంటూ మంచి సాహిత్యంతో ఉన్న ఈ పాట చాలా అర్ధవంతంగా ఉండడమే గాక హాయిగా అనిపిస్తుంది. ఒక్కసారిగా మనల్ని ఎక్కడికో తీసుకుపోవడం….. ఎంతగానో ఆలోచించడం ఖాయం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూదాల్సినది ఈ పాట. సహజంగానే మంచి సింగర్ అయిన మధుప్రియతో కలిపి అంతే మధురంగా సత్తి గానం అలరిన్చిన్దనడంలో అతిశయోక్తి లేదు. ‘ఎంత మందిలో ఉన్నా ఏదో మిస్సింగూ, ఏకాకిగా ఉన్నా ఏదో మిస్సింగూ… వేల కోట్ల డబ్బులున్నా ఏదో మిస్సింగ్…’ అంటూ ఆరంభమైన ఈ పాటను కందికొండ వ్రాయగా మధుప్రియ, బిత్తిరి సత్తి పాడారు. నందన్ రాజ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చగా, కందికొండ, నందన్ రాజ్ బొబ్బిలి కలిసి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దిగువనున్న ఈ వీడియోను చూసి ‘సత్తి’ చెప్పినట్లు మీరేమైనా మిస్సవుతున్నారా?….. ఆలోచించండి.

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

1 COMMENT

  1. అన్న చాలా బాగుంది ఇంకా తెలంగాణ గాయకులు ఎదగాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here