రెండు తెలుగు రాష్ట్రాలలో పల్లెప్రపంచం

0
221

పల్లెప్రపంచం విజన్, మార్కెటింగ్ ప్లాన్ అంశాలపై శనివారం పూర్తిస్థాయిలో ట్రైనింగ్ క్లాస్ నిర్వహించాము. ఖమ్మంలో జరిగిన ఈ క్లాసు కు బోయనపల్లి అంజయ్య, చెరుకుపల్లి పరశురాముడు, బొప్పాల అజయ్ కుమార్, గుత్తా శివ శంకర ప్రసాద్ లు హాజరుకాగా సంస్థ అధినేత పల్లా కొండలరావు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన పరీక్షలో బోయనపల్లి అంజయ్య, చెరుకుపల్లి పరశురాముడు ప్రధమ, ద్వితీయ స్థానాలలో ప్రతిభ కనబరచారు. శిక్షణ అనంతరం జరిగిన సమావేశంలో పల్లె ప్రపంచంలో ప్రతి శనివారం సాయంత్రం వివిధ అంశాలపై స్టడీ సర్కిల్ నిర్వహించాలని, ప్రతి ఇంటిలో అధ్యయనం అనేది ఓ అలవాటుగా తీసుకురావడానికి ఇంటింటా గ్రంధాలయం పథకం విజయవంతంగా అమలు చేయాలని, ఇంటింటా మొక్కలు – ఊరూరా వనాలు కార్యక్రమం ద్వారా మొక్కలు పెంపకం కార్యక్రమం చేపట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, ఇందుకు గాను ఖమ్మం జిల్లాలో ఒక గ్రామాన్ని ముందుగా మోడల్ విలేజ్ గా రూపొందించాలని , వివిధ అంశాలపై రెగ్యులర్ గా శిక్షణా కార్యక్రమాలు జరపాలని నిర్ణయించడమైనది. పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక ద్వారా సామాజిక చైతన్యం కల్పించేందుకు గాను ప్రతి గ్రామం నుండి ఒకరిని పార్ టైం రిపోర్టర్ గా తీసుకోవాలని – ఇందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం రూపొందించాలని, దీనిని రెండు తెలుగు రాష్ట్రాలలో చేపట్టాలని, ముందుగా ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ప్రకృతి జీవన విధానం పై, ప్రక్రుతి వ్యవసాయంపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని ప్రతి శనివారం ఈ అంశాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ వారం రోజులు ఎవరు ఏ పని చేయాలనేది ప్రణాళిక వేసుకోవడం జరిగింది.

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here