వి(క)నదగునెవ్వరు చెప్పిన

2
133

“వినదగునెవ్వరు చెప్పిన;
వినినంతన వేగపడక వివరింపదగున్;
గనికల్ల నిజందెలసిన;
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ! “ …… అన్నారు శతకకారుడు.

మనం నిత్యం ఎన్నో వింటుంటాము. చూస్తుంటాము. గమనిస్తుంటాము. ఎందరో వ్యక్తులు, విషయాలు, అంశాలు తారసపడడం సహజం. ఇలా మనం గమనించేవాటిలో మనకు కొన్ని బాగా నచ్చుతుంటాయి. కొన్ని నచ్చకపోవచ్చు. వాటిలో కొన్నింటిని కొన్నిరోజుల తరువాత మరచిపోతుంటాము. కొన్ని ప్రత్యేక సందర్భాలలో జ్ఞాపకం వస్తుంటాయి. అలా మీకు నచ్చినవి, సమాజానికి ఉపయోగకరమైనవి మాకు వ్రాసి పంపండి. ఇలా అందరి చేత సేకరించినవి ఒక చోట చేర్చడం ద్వారా అందరికీ మరింత ప్రయోజనం కలిగించేవిధంగా ఉంటుందని భావిస్తున్నాము. చిన్న అంశమైనా….. ఇంతకు ముందు అందరికీ తెలిసిందే అయినా మీకు అది ఎందుకు నచ్చిందో తెలుపుతూ నాలుగు మాటలు వ్రాయండి. వీలుంటే వివరించండి. ఓ మహనీయుని మాట కావచ్చు, మంచి రచనలో ఓ భాగం కావచ్చు, నీతి పద్యం కావచ్చు, సినిమా డైలాగ్ కావచ్చు, సీన్ వీడియో కావచ్చు, సోషల్ మీడియా సందేశం కావచ్చు….. అది మీకు ఎందుకు నచ్చింది వివరిస్తూ మీ వివరాలతో మాకు వ్రాసి పంపండి. బాగున్నవాటిని పల్లెప్రపంచం అంతర్జాల పత్రికలో వి(క)నదగునెవ్వరు చెప్పిన… శీర్షిక లో ప్రచురిస్తాము. 

మీ రచనలు పంపించాల్సిన Mail ID: palleprapancham@gmail.com

-ఎడిటర్

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here