వాట్సాప్ లో స్టిక్కర్లొచ్చాయ్! వాడటం ఎలా? వివరాలివీ..

0
103

ఫేస్బుక్ సంస్థ వాట్సాప్ ను కొనుగోలు చేసిన తరువాత ఆడియో, వీడియో కాల్స్, వాట్సాప్ బిజినెస్, స్వైప్ చేస్తే రిప్లై, సులభంగా ఫార్వాడ్ చేసుకునే విధానం, గూగుల్ డ్రైవ్ బ్యాకప్, ఫోటో-వీడియో స్టేటస్, మల్టీగ్యాలరీ వంటి అనేక మార్పులు తీసుకొచ్చింది. ఇంకా తీసుకొస్తూనే ఉంది. ప్రముఖ మెసెంజర్లన్నింటిలో ఉండి, వాట్సాప్ మెసెంజర్లో లేని సదుపాయాలలో మొదటిది స్టిక్కర్స్. ఇమోజీలు, టెక్స్ట్ ద్వారా సాధ్యం కాని కొన్ని భావాలను స్టిక్కర్ల ద్వారా సులభంగా వ్యక్తపరచవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం హైక్ మెసెంజర్ గురించి వినే వుంటారు. హైక్ మెసెంజర్లో స్టిక్కర్స్ ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలు, ప్రముఖ చిత్రాలనుండి కూడా స్టిక్కర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటివరకు వాట్సాప్ ఈ స్టిక్కర్లను అనుసంధానించడానికి విముఖత చూపుతూ వస్తుంది. ఇటీవలె వాట్సాప్ తమ వైఖరిని మార్చుకుంది.

తాజా వాట్సాప్ వర్షన్లో స్టిక్కర్లకు స్థానం కల్పించింది. ప్రస్తుతం కొంతమంది ఆర్టిస్టుల నుండే స్టిక్కర్లను రూపొందించి అందుబాటులో వుంచింది. మున్ముందు ఎవరైనా స్టిక్కర్లను డిజైన్ చేసుకుని అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తుంది.

వాట్సాప్ లో స్టిక్కర్లను వాడడం ఎలా?

  • ఇప్పటికే వాట్సాప్ తాజా వర్షన్కు అప్డేట్ అవ్వకపోతే, తాజా వాట్సాప్ వర్షన్ కు అప్డేట్ అవ్వండి: గూగుల్ ప్లే స్టోర్ / ఆపిల్ స్టోర్
  • తర్వాత ఏదైనా వాట్సాప్ చాట్ ను తెరవండి. తరువాత క్రింది తెరలో చూపించినట్లు కీబోర్డు > ఇమోజీలు > స్టిక్కర్స్ విభాగానికి వెళ్ళండి. అంతే! ప్రస్తుతం 4 భాగాలకు చెందిన స్టిక్కర్లే అందుబాటులో వున్నాయి. త్వరలోనే మరిన్న స్టిక్కర్ ప్యాక్లు, ప్రత్యేకించి స్థానిక ఆసక్తులను బట్టి అందుబాటులోకి రానున్నాయి.

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here