అక్టోబర్ 2 నుండి అరుణచంద్ర వెబ్ సిరీస్ స్టోరీ ప్రారంభం

0
1147

మీ పల్లెప్రపంచం అంతర్జాల పత్రికలో అక్టోబర్ 2 నుండి అరుణచంద్ర వెబ్ సిరీస్ స్టోరీ పబ్లిష్ అవుతుంది. వారానికోసారి ఈ ధారావాహిక మీ ముందు ఉంటుంది. అరుణచంద్ర రచయిత బి.వి.డి ప్రసాదరావు. రచయిత వివరాలు దిగువన ఇస్తున్నాము.

పూర్తి పేరు : బత్తుల వెంకట దుర్గా ప్రసాదరావు

విలాసము : పుట్టుక, వృద్ధి – పార్వతీపురం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం – హైదరాబాద్, తెలంగాణ

ఉనికి : పుస్తక పాఠాల అభ్యాసం కన్నా జీవిత పాఠాల అభ్యాసం మిన్నయ్యింది. 

రచనా విథం : తనలో భావాన్ని రాతగా మలచడం పట్ల మక్కువ. అంచేతనే రచనల వైపు మొగ్గానంటారు. చెప్పతలిచింది మితంగా తన రీతిన చదివించేలా మాత్రమే రాయాలన్నది రచయిత సొంత ఒరవడి. ‘నా రచన సందేశం ఇవ్వనక్కరలేదు కానీ నా రచన సందేహం కారాదన్నది నా వంతు తపన’ ‘నా రచన చెడకొట్టింది లేదా నా రచన రెచ్చకొట్టింది లేదా నా రచన దిగజార్చింది’ అని అనిపించుకోరాదన్నది నా దృఢ నియమం అంటారాయన.

రచనా క్రమం :  ‘వివిధ ప్రక్రియల్లో సాగుతూ ఉంటుంది బి.వి.డి ప్రసాదరావు రచనా సరళి.  తన సొత్తు, తన శైలి అన్నట్టుగా కురచ కథలు, సూక్ష్మ కథలు, బుడుత కథలు అనే రచనా ప్రక్రియలను రూపొందించుకొని ఆయా రచనలు చేశారు. ‘అరుణ చంద్ర’ రచనకి ముందు వరకు రచయితకు చెందిన మొత్తం రచనలు 537. ఇవి వివిధ ప్రింట్ మీడియాల్లో మరియు ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచురణ అయ్యాయి. ఈయన రచనలు 85 eBooksగా ప్రచురితమయ్యాయి.

తెలుగు బ్లాగు : రచయితకు సంబంధించిన వివిధ రాతలు టపాలుగా తన తెలుగు బ్లాగులో తరుచుగా వస్తుంటాయి.  బ్లాగు ద్వారానే తన తాజా రచనల సంగతులూ వెలువరిస్తుంటారు.

రచయిత గురించి , ఆయన రచనల గురించి వివరణలు/వివరములు క్రింద సూచించిన బ్లాగులో పూర్తిగా లభిస్తుంటాయి.

అరుణచంద్ర రచయిత బివిడి ప్రసాదరావు తెలుగు బ్లాగు లింక్ – https://bvdprasadarao-pvp.blogspot.in

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here