అరుణచంద్ర వెబ్ సిరీస్ ప్రారంభం – పరిచయం

0
1318

బత్తుల వెంకట దుర్గా ప్రసాదరావు అలియాస్ బివిడి ప్రసాదరావు గారి “అరుణచంద్ర” వెబ్-సిరీస్..నేటి నుండి ప్రతీవారం ధారావాహికగా మన “పల్లెప్రపంచం” లో ప్రచురించబడుతుంది. గతవారం ఈ టపాలో తెలిపినట్లు..ఈ రోజునుండి మొదలు. మొదటిగా “అరుణ చంద్ర” పరిచయం:

రవైఒక్క యేళ్లు గడిచాయి. గడిచిందంతా హాఫీయా” అని అడిగాడు అరుణను తన తండ్రి కృష్ణమూర్తి.

“చాలా బాగా నడుస్తోంది లైఫ్. మీ సహకారమే బోల్డు. థాంక్స్ నాన్నా, థాంక్స్ అమ్మా” అంది అరుణ.

***

“ఈ బర్త్డే నాడు చెప్తానన్నారు మీ లాస్ట్ బర్త్డే నాడు” అన్నాడు చంద్ర.

“అవును. గుర్తు ఉంది. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంథాలు ఇక చూడడం మొదలు పెట్టమన్నాను. ఏదైనా వాళ్లు నిర్ణయంకే నేను కట్టుబడి ఉంటాను.” అంది అరుణ.

“యయ. నా ప్రపోజల్ని కూడా వారికి తెల్పండి మరి” అని చెప్పాడు చంద్ర.

“వై నాట్. తప్పక.” అని అంది అరుణ.

***

“నాన్నా, చంద్రగారు తిరిగి కదిపారు అప్పటి తన ప్రపోజల్ని” అని చెప్పింది అరుణ.

“ఆ అబ్బాయి ఇంకా పెళ్లి చేసుకోలేదా” అని అంది అరుణ తల్లి లక్ష్మి.

“లేదమ్మా, స్టిల్ వైయిటింగ్ ఫర్మి” అంది అరుణ.

“అయ్య బాబోయ్. నిజమా. ఏమిటా అబ్బాయి” అని అంది లక్ష్మి.

“గత యేడాది నీ పుట్టిన రోజున ప్రపోజ్ చేసిన ఆ ఆసామి నేటి వరకూ ఆగాడా.” అన్నాడు కృష్ణమూర్తి.

***

“మన మధ్య ఏ అభ్యంతరాలు తగలక పోయేసరికి హాయనిపించింది. మన పిల్లలు మాట్లాడు కున్నవి అన్నీ చంద్ర మాకు చెప్పాడు” అని చెప్పాడు చంద్ర తండ్రి శరత్.

“మీతో సంబంధం ఏర్పడడం మాకు ఆనందానిస్తోంది. అరుణ నుంచి మాకు కూడా మీ అభిప్రాయాలు తెలిశాయి. అందుకే రాగలిగాం” చెప్పాడు కృష్ణమూర్తి.

“అన్నింటా అనుకూలమయ్యింది కనుక, ఇక సాధ్యమైనంత త్వరగా అరుణ, చంద్రల పెళ్లి జరిపిద్దాం. ఏమంటారు” అని అడిగింది లక్ష్మి.

“అలాగే కానిద్దాం” అని చెప్పింది చంద్ర తల్లి శ్రావణి.

***

“మాకు మ్యారేజ్. తప్పక రావాలి” అంటూ తమ ఆఫీస్స్టాప్కు పేరు పేరున తమ వెడ్డింగ్కార్డ్ను అందిస్తున్నారు అరుణ, చంద్రలు.
వాళ్ల ఉత్సాహానికి ముచ్చట పడుతున్నారు వారంతా.

***

తమ శోభనం రాత్రిన –
“మనం పెళ్లికి ముందు ముచ్చటించుకున్నవి నెరవేర్చుకుందాం” అంది అరుణ.

“అవే కాదు. ముందు ముందు తారస పడే ప్రతి మన అవసరాన్ని అనుకూలంగా తీర్చుకుందాం” అని చెప్పాడు చంద్ర.
ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.

***

ఇంత సాఫీగా సాగిపోతూన్నట్టు ఉన్న ఈ కథ పయినమెటు? అరుణ, చంద్రల అవసరాలేమిటి? వారు పెళ్లికి ముందు ఆడుకున్న ఆ ముచ్చట్లేమిటి? వాటిని ఎంత వరకు వారు నెరవేర్చుకున్నారు?

వీటికి సమాధానాలు వచ్చే వారం నుండి వెబ్ సీరీస్ స్టోరీ అరుణ చంద్ర మీకు ఇవ్వబోతోంది …

***

తనలో భావాన్ని రాతగా మలచడం పట్ల మక్కువ. అంచేతనే రచనల వైపు మొగ్గానంటారు. చెప్పతలిచింది మితంగా తన రీతిన చదివించేలా మాత్రమే రాయాలన్నది రచయిత సొంత ఒరవడి. ‘నా రచన సందేశం ఇవ్వనక్కరలేదు కానీ నా రచన సందేహం కారాదన్నది నా వంతు తపన’ ‘నా రచన చెడకొట్టింది లేదా నా రచన రెచ్చకొట్టింది లేదా నా రచన దిగజార్చింది’ అని అనిపించుకోరాదన్నది నా దృఢ నియమం అంటారాయన.


గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here