తెలంగాణలో మీ ఓటు ఉన్నట్లేనా?!

0
1256

తెలంగాణలో త్వరలోనే ముందస్తు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటీవలె ఓట్ల జాబితాను ప్రకటించింది. ఈ ఓట్ల జాబితాలో ఏవైనా సవరణలుంటే ఈ సెప్టెంబరు 10 నుండి 25వ తేదీ లోపు మార్పులు చేసుకోవాలని ఎలక్షన్ కమీషన్ సూచించింది. సవరణలు పూర్తయిన పిమ్మట అక్టోబర్ 8న తుది జాబితా విడుదలవుతుంది. ప్రతిపక్షాలు ఓట్ల ప్రక్రియకు తగినంత సమయం ఇవ్వలేదని, భారీమొత్తంలో ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపిస్తున్నాయి. ఇంతకీ మీ ఓటు వుందో లేదో చూసుకున్నారా? ఇప్పుడు చూడండి!

లంకె: https://electoralsearch.in/

పై లంకెకు వెళ్ళి ఇప్పటికే మీకు ఓటర్ ఐడీ వుంటే ముందుగా మీ జిల్లా పేరును సెలక్టు చేసుకుని Photo Identification Number అని వున్న చోట మీ ఓటర్ ఐడీ నంబరును ఎంటర్ చేసి వెతకండి. ఒకవేళ మీ ఓటు వున్నట్లయితే అక్కడ ప్రత్యక్షమవుతుంది. దానిని ప్రింటు / డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా వుంటుంది.

ఒకవేళ మీరు కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే మీ జిల్లాను సెలక్ట్ చేసి మీ పేరు లేదా ఇంటి నంబరును ఎంటర్ చేసి వెతకవచ్చు.

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here