మళ్ళీ పాత పద్ధతే..ఈసారి ఆధార్ నంబర్ కూడా అడగొద్దు..టెలికం ఆపరేటర్లకు ఆదేశాలు!

0
111

ఇటీవల సుప్రీం కోర్టు ఆధార్ వాడకంపై తీర్పునిచ్చిన నేపథ్యంలో నిన్న (26.10.2018) టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ టెలికం ఆపరేటర్లకు ఆధార్ తో కొత్త సిమ్ కార్డులను వెరిఫై చేయడం ఆపివేయడండని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి నవంబర్ 5వ తేదీలోపు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని మొబైల్ ఆపరేటర్లకు తెలిపింది.

గత సంవత్సరం జియో ద్వారా ఆధార్ ద్వారా వినియోగదారుల ఐడెంటిటీని వెరిఫై చేయడం మొదలై, క్రమంగా అన్ని మొబైల్ ఆపరేటర్లు ఈ పద్ధతిని ప్రారంభించారు. నిజానికి ప్రభుత్వం కూడా ఆధార్ ద్వారా వెరిఫై చేయని సిమ్ కార్డులు చెల్లవని తెలిపింది. అన్ని మొబైల్ ఆపరేటర్లు ఈ విషయమై అత్యుత్సాహం కూడా ప్రదర్శించారు. దేశంలోని కోట్ల ప్రజల మొబైల్ ఫోన్లకు ఆధార్ తో రీవెరిఫై చేయించుకోవాలని, లేకపోతే సిమ్ డీయాక్టివేట్ అవుతుందనీ మెసేజ్ లు, ఫోన్లు కూడా వచ్చాయి. ఈ హడావుడితో అతి తక్కువ కాలంలోనే, షుమారు 6 నెలల వ్యవధిలోనే దేశంలో సగానికి పైగా మొబైల్ కనెక్షన్లన్నీ ఆధార్ బయోమెట్రిక్ డేటాబేస్ ద్వారా వెరిఫై అయిన తరువాత, తాజాగా సుప్రీం కోర్టు ఆధార్ ద్వారా సిమ్ కార్డులు వెరిఫై చేయడం తగదని తీర్పునిచ్చింది. ఆధార్ వివరాలు ప్రైవేటు కంపెనీల చేతిలో ఉండడం సరికాదని వెల్లడించింది. ఇప్పటికే ఉన్న డేటాబేస్ కూడా తొలగించాలని తెలిపింది. నిజానికి ఈ తీర్పు సరైనదే ప్రైవసీ పరంగా సరైనదే అయినప్పటికీ అధిక సంఖ్యాకుల సమయం వృథా అయిన విషయం మాత్రం వాస్తవం.

కాగా, మళ్ళీ దేశంలోని వినియోగదారులందరూ ఆధార్-ఏతర అడ్రస్ (ఐడీ) ప్రూఫ్ తో సంబంధింత ఆపరేటర్ల కార్యాలయాల్లోనో, దగ్గర్లోని మొబైల్ షాపులోనో పాత ప్రూఫ్ లు సమర్పించాల్సి వుంటుంది. ఈసారి వెరిఫికేషన్ లో ఆధార్ నంబర్ కూడా వుండటానికి వీల్లేదని కూడా టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆదేశాలివ్వడం గమనార్హం.

టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆదేశాలివి:

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here