అమెరికాలో తెలుగు వేగం – మన భాషే ముందు

0
122

అమెరికాలో అత్యంత వేగంగా పెరుగుతున్న భాష తెలుగు అని తేలింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా  ధృవీకరించింది. ఇది తెలుగువారమైన మనకు ఉత్సాహాన్నిచ్చే సమాచారం.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యువత టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాలలో పై చదువులకు, ఉద్యోగాలకోసం ఎక్కువగా అమెరికాకు వెళ్తుంటారు. అమెరికాకు వెళ్ళేవారిలో ఎక్కువమంది హైదరాబాద్ వారే. 2015 అమెరికా కాన్సులేట్ ఇచ్చిన వీసాలలో అధికశాతం తెలుగువారివే.

అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 2010- 2017 మధ్య 86% పెరిగింది. తెలుగు తర్వాతి స్థానంలో అరబిక్, హిందీ, ఉర్దూ ఉన్నాయి. వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ వివిధ సూచికలనుండి సేకరించిన సమాచారాన్ని ఓ వీడియోగా ఉంచడం జరిగింది.

అమెరికాలో నివసించే వారిలో ఇంటివద్ద సగానికి పైగా ఇంగ్లీష్ మాట్లాడరు. ప్రతి 5గురిలో ఒకరు ఇంటివద్ద ఇంగ్లీషేతర భాషను మాట్లాడుతారు. ఈ భాషలలో అధికంగా స్పానిష్, చైనీస్ భాషలు ప్రథమంగా ఉంటాయి. వివిధ దేశాల భాషలను నేర్చుకోవడమే గాక మాట్లాడడాన్ని అమెరికన్ల నుండి మనమూ ఆదర్శంగా తీసుకోవచ్చు.

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here