మొబైల్ వాడకంలో జాగ్రత్తలు పాటించండి!

0
120
సెల్ ఫోన్ మాట్లాడేప్పుడు ఈ జాగ్తత్తలు పాటించండి - పల్లె ప్రపంచం

ప్రస్తుత జీవన విధానంలో మొబైల్ లేని జీవితాన్ని ఊహించలేని పరిస్తితి. మొబైల్ వాడకానికి సంబంధించి అనేక మార్లు జాగ్రత్తలు వింటూనే ఉన్నా మరోవైపు దాని వలన అనర్దాలూ పెరుగుతూనే ఉన్నాయి. మొబైల్ వాడకంలో జాగ్రత్తలకు సంబంధించి పల్లెప్రపంచం ఖమ్మం జిల్లా ఇంచార్జి బోయనపల్లి సురేష్ అందిస్తున్న కొన్ని జాగ్రత్తలు – సూచనలు ఇవి. ఇవన్నీ గతంలో మనం ఎక్కడో ఒక చోట చూసినవీ… విన్నవీనూ….. అందరికీ ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తూ…. వీలయినంతమేరకు మీరూ ఈ జాగ్రత్తలు పాటించండి. మీ మిత్రులకు షేర్ చేయండి.

 • మొబైల్ ని అతిగా వాడితే ఎన్ని సమస్యలు వస్తున్నాయో ఇప్పటికే పలు పరిశోధనలు ఋజువు చేస్తున్నాయి.
 • నేడు మొబైల్ వాడకం ప్రతి ఒక్కరికీ రోజువారీ జీవితంలో తప్పనిసరి అయ్యింది. కాబట్టి సెల్ఫోన్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రేడియేషన్ ముప్పు కొంతైనా తగ్గుతుంది.
 • బ్యాటరీ చార్జ్ తక్కువగా ఉన్నప్పుడు మాట్లాడొద్దు. కేవలం రెండు పాయింట్లు ఉన్నప్పుడు మాట్లాడితే ఐదు రెట్లు రేడియేషన్ ప్రభావం ఉంటుంది.
 • అప్పుడప్పుడు డయల్ కాల్స్, రీసివ్ కాల్స్ పరిశీలించుకుంటే రోజుకి ఎన్ని గంటలు మాట్లాడుతున్నాము అర్థం అవుతుంది. దానిని బట్టి వాడకం తగ్గించుకోవచ్చు.
 • ప్రతి చిన్న విషయానికి ఫోన్ చేయకుండా పొట్టి సందేశాలతో అవతలి వారికి విషయాన్ని చేరవేయవచ్చు.
 • ఎక్కువ భాగం మెసేజ్ లు పంపించడం ఒక అలవాటు గా చేసుకోవడం ఉత్తమం.
 • వేడి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గంటల తరబడి ఛార్జింగ్ పెడితే సమస్యలు వస్తాయి. కొన్ని ఫోన్లు అయితే ఒక్కోసారి పేలి పోయే ప్రమాదం లేకపోలేదు.

 • దీర్ఘ కాలంగా ఏ చిన్న సమస్య వేధిస్తున్నా ఫోన్ ను మార్చడం మంచిది.
 • పూర్తిస్థాయిలో చార్జింగ్ పెట్టిన తర్వాత కూడా తొందరగా ఛార్జ్ ఖర్చు అవుతుంటే ఆ ఫోన్ బ్యాటరీ మార్చక తప్పదు.
 • మల్టీమీడియా ఫోన్లలో అప్లికేషన్లను ఎల్లపుడూ ఆన్ లో ఉంచకూడదు. దీనివల్ల ఇంటర్నెట్ ద్వారా ఆటోమేటిక్ అప్లోడ్స్ పెరిగిపోయి ఫోన్ లోని సాఫ్ట్వేర్ నెమ్మదిస్తుంది. తద్వారా ఇబ్బందులు వస్తాయి.
 • వ్యాపార, ఉద్యోగ రీత్యా ఎక్కువ సేపు మాట్లాడాల్సి వస్తే… బ్లూటూత్, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడితే దుష్పరిణామాలు తగ్గిపోతాయి.
 • అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్ ఏర్ పెట్రోల్ బంక్ లలో ఫోన్స్ వాడకూడదు.
 • చిన్న పిల్లలకి ఫోన్స్ అలవాటు చేయకూడదు.
 • సెల్ ఫోనుని చేత్తో పట్టుకుని, చెవికి ఆనించి మాట్లాడటం కంటే ఫోనుని జేబులోనో, బల్లమీదో పెట్టుకుని, దాని నుండి ఒక తీగని చెవిదాకా తీసుకొచ్చి వినటానికి, మాట్లాడటానికీ సదుపాయం ఉంటే కొంత ఊరట.
 • తలకీ, సెల్ ఫోనుకీ దూరం పెంచండి. అదే విధంగా, వీలయినప్పుడల్లా శరీరానికి, సెల్ ఫోనుకీ దూరం పెంచండి.
 • ఈ జాగ్రత్తలకి కారణం సెల్ ఫోనులో ఉండే బేటరీ పేలిపోయి, కాలిపోయే అవకాశం ఉంది కనుక!!
 • సెల్ ఫోను అందుబాటులో ఉంది కదా అని ఇరవైనాలుగు గంటలు అదే పనిగా దానిని చెవికి ఆనించి మాట్లాడటం కంటె, సెల్ ఫోను లోకాభిరామాయణానికి కాదని, అవసరం వెంబడి వార్తలని చేరవెయ్యటానికనీ గమనించి, క్లుప్తంగా వాడటం నేర్చుకోవాలి.
 • కారు, రైలు వంటి వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోను మీద మాట్లాడ వద్దు. నాకు తెలుసున్న వ్యక్తి, కుర్రాడు, నవీ ముంబాయిలో కారు తోలుతూ సెల్ ఫోనులో మైమరచి మాట్లాడుతూ ఎదురుగా వచ్చే బండిని చూసుకోకుండా గుద్దేసి నిష్కారణంగా అసువులు బాసేడు. బతికుంటే బలుసాకు ఏరుకు తినొచ్చు.
 • సెల్ టవర్లు, సెల్ఫోన్ల రేడియేషన్ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకటించింది.
 • టవర్లు, ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా క్యాన్సర్ ముప్పు ఉందనడానికి ఆధారాలు లేవని, మెదడుపైన, నిద్రపోయే సమయంపై పడే ప్రభావం కూడా చాలా స్వల్పమని పేర్కొంది.
 • అయితే టవర్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల కన్నా సెల్ఫోన్ నుంచి వెలువడే తరంగాలు వెయ్యి రెట్లు అధికమని దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫోన్ వాడకాన్ని నియంత్రించుకోవాలని సూచించింది.
 • సెల్ఫోన్ మెదడుకు దూరంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి రేడియేషన్ ప్రభావమూ దానిపై పడదు. మాట్లాడుతున్నప్పుడే కాదు. పక్కన పడేసినప్పుడూ సెల్ఫోన్ నుంచి రేడియేషన్ వెలువడుతుంది. అందుకే దీన్ని తల పక్కనే పెట్టుకొని అలారం గడియారంలా వాడకపోవటమే మంచిది.
 • సెల్ఫోన్ని ప్యాంటు జేబులో పెట్టుకున్నా, బెల్ట్కు ధరించినా సంతాన సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. వీలైనప్పుడల్లా సెల్ఫోన్ని దూరంగా ఉంచటం మేలు.

సంకలనం – బోయనపల్లి సురేష్ 

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here