చూపుడు వేలు లేనివారు, చేతులు లేనివారు ఓటు ఎలా వేస్తారు?

0
86

సాధారణంగా ఓటును EVM పై నొక్కిన తరువాత ఓటు వేసినట్లుగా ఎన్నికల సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా గుర్తును వేస్తారు. మరి చూపుడు వేలు లేకపోతే? అసలు చేతికి వేళ్ళు లేనివారు, చేతులు లేనివారు ఓటు ఎలా వేస్తారు? చాలామందికి ఈ సందేహం వచ్చి వుంటుంది. భారత ఎన్నికల సంఘం ‘ఓటు అందరికీ అందుబాటులో వుండాలి’ అనే సిద్ధాంతంతో పనిచేస్తుంది. వికలాంగులు ఓటును వినియోగించుకునేందుకు ప్రత్యేక సదుపాయాలు కూడా వుండేలా మార్గదర్శకాలున్నాయి.

ఓటు వేసిన తరువాత ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుకు ఎన్నికల సిబ్బంది సిరా గుర్తు వేస్తారు. రెండోసారి ఓటు వేసేందుకు వీలులేకుండా ఇలా చేస్తారు. అయితే చూపుడు వేలు లేనివారికి ఎడమ చేతి మధ్యవేలికి సిరా గుర్తు వేస్తారు. అదీ లేకపోతే ఉంగరపు వేలుకు, చిటికెన వేలుకు..ఇలా బొటనవేలు వరకూ గుర్తును పెట్టొచ్చు. ఎడమ చేయి లేకపోతే కుడి చేయికి ఇదే క్రమాన్ని పాటిస్తారు. రెండు చేతులకు వేళ్ళు లేకపోతే కాలి వేళ్ళతో ఓటు వేయగలిగితే, ఆ కాలి వేలుకు సిరా గుర్తు వేస్తారు.

ఒకవేళ ఓటరు స్వంతంగా ఓటు వేయలేని పరిస్థితిలో వుంటే, ఎన్నికల నియమాలు, 1961, 49N నియమం ప్రకారం, ఓటరు తన పక్షాన ఓటు వేయడానికి 18 సంవత్సరాల పైబడిన వ్యక్తిని తన తరపున ఓటు వేయడానికి తీసుకురావచ్చు. ఆ నియమాలను ఇక్కడ చూడవచ్చు:

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here