ఎలక్షన్ సమయంలో రాజకీయ పోస్టులు షేర్ చేస్తున్నారా..జాగ్రత్త!

0
180

2019 లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సోషల్ మీడియాలోని రాజకీయ పోస్టులపై, వాటి ప్రభావంపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది. దీనికి గాను ఇటీవలె ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ సంస్థలకు నకిలీ, సున్నితమైన, రాజకీయ ప్రలోభాలకు గురిచేసే వార్తలు, సమాచారాన్ని ఎన్నికల సమయంలో కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనికి ఆయా సంస్థలు అంగీకారం తెలిపాయి.

తాజాగా ఫేస్బుక్ సంస్థ సెక్యూరిటీ భాగంలో స్పెషలిస్టులను, సమాచారం భాగానికి సంబంధించిన స్పెషలిస్టులను, మరికొంతమందిని కలిపి ఒక “టాస్క్ ఫోర్స్” ను ఏర్పరించింది. ఈ ఎలక్షన్ల సమయంలో రాజకీయ పోస్టులపై నిఘా వుంచి వాటిని తగిన చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు తెలిపింది. ఇటీవలె జరిగిన ఫేస్బుక్ “కమ్యూనిటీ స్టాండర్డ్స్” వర్క్‌షాప్‌లో ఈ వివరాలను తెలిపింది.

గతంలో జరిగిన అమెరికా, రష్యా ఎన్నికలలో సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా వున్నదని విమర్శలు రావడంతో ఈసారి ఎన్నికలలో ఈ జాగ్రత్తలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఏప్రిల్ లోనే ఫేస్‌బుక్ సంస్థాధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఎన్నికల సమయంలో తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లను తప్పుడు పద్ధతుల్లో వాడేందుకు ఆస్కారాం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈ రాజకీయ, ఓటర్లు ప్రలోభానికి గురయ్యే విధంగా వున్న పోస్టులను గుర్తించేందుకు గాను వివిధ సోషల్ మీడియా సంస్థలు మెషీన్ లెర్నింగ్ (ML), కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) టెక్నాలజీని ఉపయోగించనున్నాయి.

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here