ఇదే మా విజన్

0
104

‘పల్లెప్రపంచం సర్వీసెస్’ విజన్ లో భాగంగా పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక నడపబడుతున్నదని ‘ఆదరించండి టపాలో తెలపడం జరిగింది. విజన్ వివరాలు ఈ టపాలో తెలియజేస్తున్నాను.

మా సంస్థ తరపున వివిధ కంపెనీల ప్రొడక్టులను మార్కెటింగ్ చేస్తాము. సేంద్రీయ వ్యవసాయం, మొక్కల పెంపకం కు సంబంధించి కొన్ని ఉత్పత్తులను స్వయంగా చేయడం ద్వారా కూడా ఉపాధి కల్పన చేయడం జరుగుతుంది. చక్కటి బిజినెస్ ప్లాన్ ద్వారా అందరికీ అదనపు ఆదాయం కల్పించేందుకు కృషి చేస్తాము.

మేము చేసే కార్యక్రమాలను ప్రచారం చేయడంతో పాటు సమాజంలో మంచి భావాలను ప్రసారం చేయడానికి ఆన్లైన్ మరియు ప్రింట్ మీడియా ద్వారా ప్రత్నిస్తాము. దీనిలో భాగంగా స్వంతంగా పత్రికల నిర్వహణతో పాటు ఇతర పత్రికల సహకారమూ తీసుకుంటాము. పత్రికారంగంలో స్వంత మీడియాతో పాటు, ఇతర పత్రికలకు సంబంధించిన ప్రకటనల సేకరణ, పత్రిక  చందాల సేకరణ పంపిణీ  ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తాము. 

వివిధ అంశాలపై పల్లెప్రపంచం సర్వీసెస్ ద్వారా శిక్షణలు ఇవ్వడం ద్వారా మనలో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యాలను సామాజిక హితం కోసం వెచ్చించడానికి మా వంతుగా కృషి చేస్తాము. ప్రతివారం ఎంపిక చేసిన వ్యక్తులతో స్టడీసర్కిల్స్ నిర్వహిస్తాము.

మంచి పుస్తకాలను చదివే అలవాటుని పెంచడం కోసం ఇంటింటా గ్రంధాలయం కార్యక్రమం నడుస్తుంది. దీనిలో భాగంగా తక్కువ పెట్టుబడికే మంచి పుస్తకాలను అందించే ప్రయత్నం చేస్తాము. ఇందుకోసం ప్యాకేజి కొనుగోలు పద్ధతిని ప్రవేశాపెడుతున్నాము.

బిజినెస్ ప్లాన్ లో ప్యాకేజి విధానం ద్వారానే  ‘ఇంటింటా మొక్కలు – ఊరూరా వనాలు’ కార్యక్రమం నిర్వహిస్తాము. దీని ద్వారా పర్యావరణం, సామాజిక్ఆ ఆరోగ్యం పెంచడమే కాకుండా అందరికీ ఆర్ధిక వనరులు పెంచేందుకు వీలుంటుంది. ఎప్పటికపుడు మొక్కల పెంపకం కార్యక్రమాలను ఈ అంతర్జాల పత్రికలో కూడా ప్రచారం చేస్తాము.

ప్రతి గ్రామంలో ప్రకృతి జీవన విధానం ను అమలు చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన, మంచి అనుబంధాలను పెంచడం ద్వారా నూతన పల్లెప్రపంచం ను సృష్టించేందుకు కృషి చేస్తాము. చేతివృత్తులను ప్రోత్సహించడం ద్వారా ప్లాస్టిక్ వంటి పర్యావరణ హానికర పదార్ధాలను రూపుమాపడం, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు మందులు, రసాయినిక ఎరువులను వాడని పంట ఉత్పత్తులను, మంచి అలవాట్లను పెంచేందుకు ప్రయత్నిస్తాము. ఇందుకోసం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాము. పల్లెలలో ఈ మంచి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరుస్తాము.

ఈ బృహత్తర కార్యక్రమానికి మీ అందరి ఆశీర్వచనాలు ఉంటాయని భావిస్తున్నాను.

-పల్లా కొండల రావు,
(మేనేజింగ్ పార్టనర్)
పల్లెప్రపంచం సర్వీసెస్.

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here