ఇక వాట్సాప్ వినియోగదారుల సహనాన్ని పరీక్షించబోతోంది!

0
135

భారతీయులు ‘ఉచితానికి’ ఎంతగా ఆకర్షితులవుతారో విదేశీ, స్వదేశీ అన్ని ప్రైవేటు కంపెనీలు, రాజకీయ పార్టీలకు బాగా తెలిసిందే. ముందు ఉచిత సర్సీసులిచ్చి వాడమని ప్రోత్సహించడం, తరువాత ‘ఉచితం’గా ఇచ్చింది తిరిగి తెచ్చుకునేదాకా రకరకాల ‘బిజినెస్’ మార్గాలను ఎంచుకోవడం, వాటిని వినియోగదారులపై రుద్దడం పరిపాటయింది. వాట్సాప్ మెసెంజర్ ను ఫేస్బుక్ సంస్థ కొనుగోలు చేసిన దగ్గరనుండి వరుసగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట్లో టెక్స్ట్ స్టేటస్ ను తీసివేసి, పిక్చర్/వీడియో స్టేటస్ మోడ్ ను తీసుకువచ్చినప్పుడే వ్యతిరేఖత బాగా వచ్చింది. ఇందుకు వాట్సాప్ సంస్థ కొత్తగా తెచ్చిన పిక్చర్ స్టేటస్ మోడ్ ను కొనసాగిస్తూనే టెక్స్ట్ స్టేటస్ ను కూడా తిరిగి తీసుకువచ్చింది, అయితే ఇప్పుడు టెక్స్ట్ స్టేటస్ వాడకం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, నిజానికి అదొక ఆప్షన్ వుందని కూడా చాలా మందికి తెలీదు. పిక్చర్ స్టేటస్ కే అందరూ అలవాటు పడిపోయారు.

ఇప్పుడు ఈ పిక్చర్ స్టేటస్ ను బిజినెస్ కు వాడుకోబోతోంది వాట్సాప్ సంస్థ. స్టేటస్ లు చూస్తూన్న సమయంలోనే మధ్యమధ్యలో బిజినెస్ ప్రకటనలు కూడా రానున్నాయి. తాజాగా ఈ విషయాన్ని వాట్సాప్ సంస్థ ధృవీకరించింది. త్వరలోనే వాట్సాప్ నూతన వర్షన్లో ప్రకటనలు రానున్నట్లు తెలిపింది. వాట్సాప్ ను ఫేస్బుక్ సంస్థ కొనుగోలు చేయకముందు ఈ పరిస్థితి వేరుగా వుండేది. అప్పట్లో వాట్సాప్ పాలసీ, వాట్సాప్ వ్యవస్థాపకుడి ప్రకారం, వాట్సాప్ సంస్థకు ప్రకటనలంటే అసహ్యమనీ, అవి ఎప్పటికీ వాట్సాప్ కు చేరబోవని తెలిపింది. కానీ, వాట్సాప్ సంస్థను ఫేస్బుక్ కొనుగోలు చేసిన తరువాత వేగంగానే పరిస్థితులు తారుమారయ్యాయి. ఒక్క స్టేటస్ ప్రకటనలే కాక, ఇటీవలె వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ ను ప్రారంభించడంతో వాట్సాప్ పూర్తిగా కమర్షియల్ గా తయారయిపోయింది.

2012 లో వాట్సాప్ అధికారిక బ్లాగు ప్రకారం:

Advertising has us chasing cars and clothes, working jobs we hate so we can buy shit we don’t need.
– Tyler Durden, Fight Club

We watched Yahoo! get eclipsed in size and reach by Google… a more efficient and more profitable ad seller. They knew what you were searching for, so they could gather your data more efficiently and sell better ads.
These days companies know literally everything about you, your friends, your interests, and they use it all to sell ads. When we sat down to start our own thing together three years ago we wanted to make something that wasn’t just another ad clearinghouse. We wanted to spend our time building a service people wanted to use because it worked and saved them money and made their lives better in a small way. We knew that we could charge people directly if we could do all those things. We knew we could do what most people aim to do every day: avoid ads.
No one wakes up excited to see more advertising, no one goes to sleep thinking about the ads they’ll see tomorrow. We know people go to sleep excited about who they chatted with that day (and disappointed about who they didn’t). We want WhatsApp to be the product that keeps you awake… and that you reach for in the morning. No one jumps up from a nap and runs to see an advertisement.
Advertising isn’t just the disruption of aesthetics, the insults to your intelligence and the interruption of your train of thought. At every company that sells ads, a significant portion of their engineering team spends their day tuning data mining, writing better code to collect all your personal data, upgrading the servers that hold all the data and making sure it’s all being logged and collated and sliced and packaged and shipped out… And at the end of the day the result of it all is a slightly different advertising banner in your browser or on your mobile screen.
Remember, when advertising is involved you the user are the product.
At WhatsApp, our engineers spend all their time fixing bugs, adding new features and ironing out all the little intricacies in our task of bringing rich, affordable, reliable messaging to every phone in the world. That’s our product and that’s our passion. Your data isn’t even in the picture. We are simply not interested in any of it.
When people ask us why we charge for WhatsApp, we say “Have you considered the alternative?”

వాట్సాప్ మెసెంజర్ ను దాదాపు స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ తరచుగా వుపయోగిస్తుండటం, సోషల్ మీడియా సంస్థలయిన ఫేస్బుక్, ట్విట్టర్ కంటే మెసెంజర్ లలోనే ఎక్కువ సమయాన్ని వినియోగదారులు వెచ్చిస్తుండటంతో, ఈ ప్రకటనలు ఫేస్బుక్/వాట్సాప్ సంస్థలకు భారీ మొత్తంలో డబ్బును సమకూర్చుతుందనడంలో సందేహం లేదు. అయితే, ఇదే సమయంలో, వాట్సాప్ వినియోగిస్తున్న ప్రతి వ్యక్తి తానేం చేయాలో, ఏం చూడాలో, ఏం ఆలోచించాలో కూడా ఈ ప్రకటనలు కొంతమేరకు నిర్ణయిస్తాయనేది అనారోగ్యకరాంశం.

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here